డోన్: డోన్ లో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు, పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 16, 2026 నంద్యాల జిల్లా డోన్లోని సాయి ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.