కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ను బిజెపి నాయకులు కనిగిరిలోని డిఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తర్లుపాడు మండలం జగన్నాధపురం లోని పురాతన వీరభద్ర స్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ డిఎస్పీకి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి కార్యదర్శి నరాల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.... నంది విగ్రహం పై జరిగిన దాడి పైసాచికమైన చర్య అన్నారు. ఇది హిందూ ధర్మంపై జరిగిన డాడీ అని, దాడికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డీఎస్పీని కోరారు. డీఎస్పీ ని కలిసిన వారిలో కనిగిరి చెందిన బిజెపి నాయకులు ఉన్నారు.