సైదాపూర్: సోమారం మోడల్ స్కూల్ పాఠశాల చుట్టూ చేరిన వరద నీరు, విద్యార్థులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్ రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తెలిపారు. భారీగా వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్టల్ లోని విద్యార్థులను అధికారులు పోలీసులు హాస్టల్ నుంచి బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కూడా ప్రహరి గోడ నిర్మాణం ఆలస్యం అవడం తోనే నీళ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.