ఒంగోలు అర్బన్: పాత కండక్టర్ మార్పిడి పనులను పరిశీలించిన ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి
Ongole Urban, Prakasam | May 26, 2026
33కేవీ తెట్టు ఫీడర్‌లో పాత కండక్టర్ మార్పిడి పనులను ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి పరిశీలించారు. మంగళవారం 33కేవీ తేట్టు ఫీడర్‌లో జరుగుతున్న పాత కండక్టర్ మార్పిడి పనులను ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి పరిశీలించి, పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పనులు కీలకమని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. పనుల పురోగతి, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు