పలమనేరు: గంగవరం: ఫ్లై ఓవర్ వద్ద ద్విచక్ర వాహన దారుడిపై కారు డ్రైవర్ దౌర్జన్యం,
వాహనదారులు ఎదురు తిరిగేసరికి పరార్
గంగవరం: బ్రిడ్జి కింద చిత్తూరు వైపు వెళ్తున్న కారు,ఓ ద్విచక్ర వాహనదారుడు కరెక్ట్ రూట్ లో వస్తున్నప్పటికీ ద్విచక్ర వాహనానికి కారు అడ్డంపెట్టి నా రూటే సపరేటు పక్కకు వెళ్ళు అంటూ ఓ కారు లో ప్రయాణిస్తున్న డ్రైవర్ దౌర్జన్యానికి దిగాడు. ద్విచక్ర వాహనదారుడు తాను వస్తున్నది కరెక్ట్ రూట్ అని ఎందుకు దౌర్జన్యంగా కారు అడ్డం పెడతారు పక్కకు వెళ్ళండి అని చెప్పినప్పటికీ ద్విచక్ర వాహనదారుడుపై దౌర్జన్యానికి దిగాడు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది, వెనక నుండి వచ్చిన వాహనదారులు సర్ది చెప్పడంతో వెనుతిరిగాడు.