డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పుత్తూరు పట్టణంలో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని సోమవారం నిర్వహించారు . ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనాలు పాల్గొని ప్రజలకు బలమైన సందేశాన్ని అందించాయి. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నేటి యువత వేగం, నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణ నష్టం అధికంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల తీవ్రమైన ప్రమాదాల్లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ చట్ట భయంతో కాదు కుటుంబ భవిష్యత్తు కోసం ధరించాలి అని స్పష్టం చేశారు