సంగారెడ్డి: సంగుపేట లో టపాకాయల గోదాంలో విద్యుత్ ప్రమాదంతో పేలిన టపాకాయలు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం జోగిపేట మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన సంగుపేట వద్దగల టపాకాయల గోదాం వద్ద శనివారం సాయంత్రం ఐదు గంటలకు విద్యుత్ ఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో టపాకాయలు దుకాణంలో టపాకాయలు భారీగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. ఈ ప్రమాదంలో లక్షల విలువగల టపాకాయలు ధ్వంసం అయ్యాయని స్థానికులు తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.