భిక్కనూర్: బిక్కనూరులో మహిళలకు ప్రత్యేక మానసిక వైద్య శిబిరం : సైకియాట్రిస్ట్ డాక్టర్ రమణ
బిక్కనూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు మానసిక వైద్య శిబిరం నిర్వహించారు. 'స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సైకియాట్రిస్ట్ డాక్టర్ రమణ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. నిద్రలేమి, మతిమరుపు, ఫిట్స్, నిరాశ, నిస్పృహ, ఆల్కహాల్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.మహిళలు ఆరోగ్యంగా ఉండి తమ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచితే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.18 సం" లు నిండిన మహిళల నుండి మొదలుకొని ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు.