మద్దిలేటి స్వామి ఆలయంలోని కోనేరులో యువకుడు గల్లంతు
Dhone, Nandyal | May 3, 2025 బేతంచర్ల మండలం వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి స్వామి ఆలయంలోని కోనేరులో యువకుడు గల్లంతైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మండలంలోని అంబాపురం గ్రామానికి చెందిన జూలకంటి మణిధర్ (17) తన మేనమామ పిల్లల వెంట్రుకల వేడుకలకు వచ్చాడు. స్నేహితులతో కలసి సరదాగా ఆలయంలో గల పెద్దగుండంలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. గుండంలో ఎంత వెతికిన యువకుడి మృతదేహం లభ్యం కాలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.