ఉరవకొండ: చిన్నముస్టూరు వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని చిన్న ముష్టురు గ్రామం వద్ద ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో అజయ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా జగన్ అనే యువకుడు తీవ్ర గాయాల పాల య్యాడని ఉరవకొండ ఎస్సై జనార్దన్ నాయుడు మంగళవారం ఉదయం పేర్కొన్నారు. ఉరవకొండ మండలం మూలగిరి పల్లి గ్రామానికి చెందిన అజయ్ జగన్లు వ్యక్తిగత పనిపై ఉరవకొండకు వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. జగన్ ను మెరుగైన చికిత్సలకు అనంతపురం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై పేర్కొన్నారు.i