కామారెడ్డి: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 21 మందికి రూ. 21 వేల జరిమానా : జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన 21 మందికి జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం సాయంత్రం 7 గంటలకు తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 6, దేవునిపల్లిలో 5, భిక్కనూరులో 2, రాజంపేటలో 1, బీబీపేటలో 2, దోమకొండలో 2, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు. మొత్తంగా 21 మందికి రూ.21 వేలు జరిమానా విధించడం జరిగిందని స్పష్టం చేశారు. న్యాయమూర్తి తీర్పునిచ్చారని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.