బొబ్బిలి: సమస్యలను గాలికొదిలేసి, వాలంటీర్ వ్యవస్థ చుట్టూ నేతలు రాజకీయం చేస్తున్నారని లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడి విమర్శ
ఓట్ల కోసం వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం తిరుగుతోందని, ఇది చాలా విడ్డూరంగా ఉందని లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ.దామోదర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ అంశం చుట్టే రాజకీయం చేయడం సరికాదని బొబ్బిలి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సమస్యలను పట్టించుకోకుండా వాలంటీర్ల కోసం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.