ఒంగోలు అర్బన్: రాయవరం రోడ్డు ప్రమాదం: ఏపీలో స్లీపర్ క్లాసు బస్సులు రద్దు అవుతాయని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి ప్రకటన
Ongole Urban, Prakasam | Apr 8, 2026
రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఈనెల 26వ తేదీన 14 మంది మృతిచెందగా ఏకంగా 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అవసరమైతే రాష్ట్రంలో స్లీపర్ క్లాస్ బస్సులను రద్దు చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం మంత్రి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో మొత్తం 2000 వరకు స్లీపర్ క్లాస్ బస్సులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో స్లీపర్ క్లాస్ బస్సులో యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.