కర్నూలు: ఆస్తిమదంతో పసిబిడ్డ ప్రాణం తీసిన నరేష్… భార్యపై హత్యాయత్నం..కుటుంబ సభ్యులనూ అరెస్ట్ చేయాలని ఐద్వా, సిపిఎం డిమాండ్
ఆస్తి ఆశతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ చివరకు పసిబిడ్డ ప్రాణాన్ని బలిగొట్టి భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన దేవనకొండకు చెందిన నరేష్ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా, సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.కర్నూలు గాయత్రి ఎస్టేట్‌లోని స్టార్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రావణిని ఆదివారం ఐద్వా రాష్ట్ర నాయకురాలు కే.అరుణ, జిల్లా సహాయ కార్యదర్శి పి.ఎస్.సుజాత, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.ఆనంద్‌బాబు, దేవనకొండ మండల నాయకులు సూరి, డివైఎఫ్ఐ న్యూ సిటీ కార్యదర్శి హుస్సేన్ బాషా, నాయకులు బాబి పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—దేవనకొండలో పది రోజు