భక్తిశ్రద్ధలతో శ్రీగిరి ప్రదక్షిణ నిర్వహించిన గిరి ప్రదక్షణ కమిటీ
Ongole Urban, Prakasam | May 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీగిరి గిరి ప్రదక్షణ శనివారం భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రవణా నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు వైశాఖమాసం బహుళ సప్తమైన పురస్కరించుకొని గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బాపూజీ గోశాలలో గోపూజ జరిపి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని పూజించారు అనంతరం స్వామి వారితో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మంగళ వాయిద్యాల నడుమ గిరిప్రదక్షిణ నిర్వహించారు