ఒంగోలు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 35 మందికి రూ.49.95 లక్షల విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామని ఇప్పటివరకు నియోజకవర్గంలో 9 కోట్లకు పైగా విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు దామచర్ల తెలిపారు.