నందికోట్కూరు: నందికొట్కూరు నుండి కర్నూలుకు నాన్ స్టాప్ బస్సు సర్వీసులు రద్దు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో బస్సుల కొరత ఏర్పడింది, శ్రీ శక్తి పథకం ద్వారా ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేయడంతో బస్సులు సరిపోవడం లేదు, దీంతో కర్నూలుకు నాన్ స్టాప్ సర్వీసులు రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు సోమవారం వెల్లడించారు, అత్యవసర పనుల నిమిత్తం కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బందులు తప్పవని ప్రయాణికులు వాపోతున్నారు, జిల్లా ఆర్టీసీ అధికారులు స్పందించి నాని స్టాప్ బస్సులను పునరుద్ధరించాలని కోరుతున్నారు