గుంతకల్లు: పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం,భారీ నిరసన ర్యాలీ
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం, భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉన్న మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అక్కడి నుంచి మెయిన్ బజార్, కసాపురం రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు.