కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని భవానీనగర్లో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మద్యం సేవించి బిర్యాని తినడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. పాండు (53) మృతి చెందగా, 15 మందిని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. బాధితులను కాంగ్రెస్ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పరామర్శించారు.