నందికోట్కూరు: సమస్యల వలయంలో పట్టణములోని రెండో వార్డు కుమ్మరిపేట
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రెండో వార్డు కుమ్మరిపేట సమస్యల వలయంగా మారింది, కొన్నేళ్ల నుండి మరుగుదొడ్డి నిరుపయోగంగా మారింది, ముక్కుపూటలు అదిరేలా కంపు వెదజల్లుతుంది, మరొకపక్క రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహిస్తుంది, మరుగుదొడ్డి పక్కనే ఉర్దూ పాఠశాల ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరుగుదొడ్డి లో విపరీతంగా చెట్లు పెరగడంతో విష సర్పాలు అప్పుడప్పుడు బయటికి వస్తున్నాడంతో విద్యార్థులు కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు, మరుగుదొడ్డి నుండి దుర్వాసన వస్తుందని దోమల బెడద ఎక్కువైందని కాలనీవాసులు వాపోతున్నారు, మరుగుదొడ్డి లోపల ఉన్న చెట్లపై విద్యుత్ తీగలు ఉం