నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన భార్గవ్ గౌడ్
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని నాగిరెడ్డిపేట ఎస్ఐ భార్గవ్ గౌడ్ కోరారు. ఆయన శనివారం ఎస్ఐగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఇక్కడ పని చేసిన మల్లారెడ్డి పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో భార్గవ్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు.