రాజమండ్రి సిటీ: పేలిన గ్యాస్ సిలిండర్లు, తప్పిన పెను ప్రమాదం, రాజమండ్రి వైఎంసి హాల్స్ సమీపంలో ఘటన
రాజమండ్రి గోదావరి గట్టును ఉన్న వైఎంసి హాల్ వెనుక గల హోటల్లో ఆదివారం రాత్రి రెండు గ్యాస్ సిలిండర్లు ఫెలాయి. ఆ సమయంలో హోటల్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. రాత్రి 9 గంటల లోపు జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.