భీమవరం: నియోజకవర్గ TDP ఇన్చార్జి సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవాలయ నూతన పాలకవర్గం
భీమవరం పట్టణంలోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవాలయ నూతన పాలకవర్గ ధర్మకర్తలు భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈసందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన పదవి లభిస్తుందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పొత్తులో భాగంగా మూడు పార్టీల నాయకులకు తగిన పదవులు ప్రాధాన్యత వారీగా నియామకాలు జరుపుతున్నారని దేవాలయ ధర్మకర్తలుగా నియమింపబడిన నూతన పాలకవర్గ కమిటీ దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.