రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన షాద్‌నగర్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఫరూఖ్‌నగర్ మం. రాయికల్ టోల్ గేట్ సమీపంలో బైక్‌ను లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.