కారు బోల్తా పడి నరసరావుపేటకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లాలో గురువారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు