వనపర్తి: వనపర్తిలో సాగునీటి కోసం రైతుల మధ్య ఘర్షణ: పానగల్లో ఉద్రిక్తత
వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని బీమా కాల్వ వద్ద సాగునీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు. చింతకుంట, మహమ్మదాపురం రైతులు నీటిని నిలిపివేయడంతో, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి గ్రామాల రైతులు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.