టిప్పర్ డ్రైవర్ పై ఆకతాయిలు దాడి .
పరిస్థితి విషమం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరు గట్టుపల్లిలో హిందీలో ఫోన్ మాట్లాడుతున్న ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన టిప్పర్ డ్రైవర్ నూర్ ఆలం,పై శనివారం రాత్రి దాదాపు పదిమంది ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. చెవులు. ముక్కు. నోట్లో రక్తం వచ్చేలా కొట్టడంతో టిప్పర్ డ్రైవర్ అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. వెంటనే స్థానికులు గమనించి యజమానికి మధుకు సమాచారం తెలిపారు ఘటన స్థలానికి యజమాని మధు చేరుకుని ఆకతాయిల దాడిలో గాయపడి స్పృహతప్పి పడి ఉన్న నూర్ ఆలం. ను హుటాహుటిన మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు