మల్లయ్యకొండకు పోటెత్తిన భక్తులు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా మల్లయ్య కొండకు శివాలయంలో భక్తులతో కిటకిటలాడింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కేదారేశ్వర గౌరీ వ్రతం ఆచరించి భక్తులు నోములు నోచుకున్నారు. కొండపై భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఆలయ అధికారులు మౌలిక వసతులు కల్పించారు.