డోన్ మండలంలోని కొంచెర్వు గ్రామంలో బుధవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఒక్కొక్కరి నుండి 96 మొత్తం 192 అక్రమ కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు సోమశేఖర రావు, దవలత్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సుధాకర్ రెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.