అనంతపురం అర్బన్: తాడిపత్రి పట్టణ ఎస్సై దయాకర్ తనను తీవ్రంగా కొట్టారని మురళీమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
Anantapur Urban, Anantapur | May 4, 2026
తాడిపత్రి పట్టణ ఎస్సై దయాకర్ తనను తీవ్రంగా కొట్టారని మురళీమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు.తాడిపత్రి పట్టణానికి చెందిన మురళీమోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఎస్ఐ దయాకర్ పై ఫిర్యాదు చేయటానికి వచ్చారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో స్టేషన్ కు వెళితే ఎస్సై దయాకర్ తనను విచక్షణ రహితంగా కొట్టారని మురళీమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.తీవ్రంగా కొట్టడంతో తన కాలు విరిగిందని వాపోయాడు. భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తి స్టేషన్ కి వెళితే కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి ఇలా కొట్టడం ఏంటని ప్రశ్నించారు.