గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్లోని ఐలాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు ఆత్మహత్య కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.లాల్ శేఖర్ (32), అనూష దంపతులు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ చిన్నతండాలో ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవలతో పుట్టింటికి వెళ్లిన భార్య అక్కడ సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త తన ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.