సంగారెడ్డి: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం జిఎస్టి తగ్గింపులు పేదలకు అందాలి : మెదక్ ఎంపీ రఘునందన్ రావు
తగ్గించిన జీఎస్టీ ఫలం నిరుపేదలకు అందాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బుధవారం రామాయంపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇటీవల పేదరికం నుంచి బయటపడిన 25 లక్షల కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపులు చేపట్టిందని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ఉద్యోగులకు ఊరట కల్పించేలా ఆదాయ పన్నును తగ్గించిందని అన్నారు. ప్రజలందరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.