ఒంగోలు అర్బన్: ఒంగోలు ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్ మేళా, సద్వినియోగం చేసుకోవాలని అధికారి రమాదేవి వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 18, 2026
ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగినవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.22 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.