ఆళ్లగడ్డ: గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు, ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు
గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు హెచ్చరించారు బుధవారం గోవిందపల్లిలో పర్యటించిన ఆయన అక్కడ ఫికెటింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు, ప్రజలు చట్టానికి సహకరించాలని నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు, ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు