ఎల్లారెడ్డి: బతుకమ్మల నిమజ్జనానికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు, బుధవారం వార్డు అధికారులు అంజయ్య, శేఖర్, గంగారాంలు, నాయకులు నునుగొండ శ్రీనివాస్, పప్పు వెంకటేశం, ఎడ్ల కిషన్, జవాన్ మహేందర్ తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల గ్రౌండ్, అజాద్ గ్రౌండ్, కొచ్చెరువు వద్ద బతుకమ్మల నిమజ్జనం, ఆడేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పరిశీలించారు. నీటి వనరుల వద్ద సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.