అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా నాయన పల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం నాయన పల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో బండమీద పల్లి గ్రామానికి చెందిన హరి అనే వ్యక్తి మృతి చెందాడు. నగర శివారు ప్రాంతంలో ఐచర్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని తిరిగి గ్రామానికి వెళుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.