బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో 80% ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి: తాసిల్దార్ షఫీ
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక ఓటరు సవరణ SIR కార్యక్రమంలో భాగంగా 80% ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేసినట్లు తహశీల్దార్ ఓటూరి షఫీ తెలిపారు. శనివారం SIR పై ఆయన సమీక్షించారు. ఓటర్ల నుంచి సమగ్ర వివరాలతో పత్రాలు స్వీకరించి నూతన జాబితాను డిజిటలైజ్ చేస్తామన్నారు. SIR ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్వోలకు సూచించారు.