ఒంగోలు అర్బన్: సర్ ప్రక్రియ పనితీరును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Jul 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలోనికి వెళ్లి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మంగళవారం ఒంగోలు నగరంలోని బృందావనం కాలనీ, నిర్మల్ నగర్, హౌసింగ్ బోర్డు, గద్దలగుంట ప్రాంతాలలో పర్యటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల డిజిటైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. డిజిటైజేషన్ త్వరగా పూర్తిచేయాలని బిఎల్ఓ లను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె వెంట ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు ఉన్నారు.