నల్లకాల్వ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మూడు ఎద్దులు అక్కడికక్కడే మృతి.
ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.రైతు బడే సాహెబ్ కు చెందిన మూడు ఎద్దులు చెరువులో పడి మృతి చెందినాయి. రైతు బడే సాహెబ్ బండికి రెండు ఎద్దులు బండికి ముందు , వెనకాల రెండు ఎద్దులను కట్టుకోని బండితో సహా ఎద్దులను శుద్ది చేయడానికి గ్రామంలో ని చెరువులోకి దిగాడు రైతు బడే సాహెబ్. అయితే చెరువు లోతును గ్రహించ లేక లోపలికి వెల్లడంతో బండితో సహా ఎద్దులు నీట మునిగాయి వెంటనే రైతు బడసాహెబ్ తన ఎద్దులను ఎలాగైనా కాపాడుకోవాలని, ప్రమాదం నుంచి తప్పించుకుని ఒక ఎద్దును రక్షించగా మిగతా మూడు ఎద్దులు నీట మునిగి మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.