కొత్తగూడెం: చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు పాటుపడాలని సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భూమి కోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించారని చెప్పారు.