అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ రాయచోటి కలెక్టరేట్ వద్ద కార్యకర్తలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళలు పెద్ద ఎత్తున రాగా, కూటమి ప్రభుత్వంపై నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు.కలెక్టర్‌ను ప్రత్యక్షంగా కలిసి తమ సమస్యలు వివరించాలంటూ కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు–పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట చోటుచేసుకుంది. కలెక్టర్ బయటికి రావాలని కార్యకర్తలు ఆందోళనను మరింత ఉధృతం చేశారు.కలెక్టర్ మీటింగ్‌లో ఉండడంతో, డిఆర్ఓ మధుసూదన్ రావు కల