రాజేంద్రనగర్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోడకూలి ఒకరు మృతి
గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న నూతన కన్వెన్షన్ సెంటర్కి చెందిన ప్రహరీ కూలి అక్కడే పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.