ఒంగోలు అర్బన్: రెవిన్యూ సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | May 7, 2026
ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించటమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోనని ఆమె హెచ్చరించారు. ' ఒక గ్రామం - ఒక నెల - నాలుగు సందర్శనలు ' కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలోనూ, కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలోనూ ప్రత్యేక రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు.ధర్మవరం గ్రామంలో ఖాతా, సర్వే నంబర్ పై రెవిన్యూ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం, ఎల్.పి.ఎం. పెండింగ్ ఉండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.