ఒంగోలు అర్బన్: పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 1, 2026
రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్ల దారులకు మే నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు పాల్గొన్నారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని రాంనగర్ మూడవ లైన్లో అధికారులు, వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, లబ్దిదారులకు పింఛన్ సొమ్ము అందజేసారు. కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ కమీషనర్ రాంభూపాల్ రెడ్డి, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.