నాగారం: మండల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్
నాగారం పోలీసు స్టేషన్ను సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్న కుమార్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నారు. సీఐ రఘువీర్ రెడ్డి ఎస్ఐ ఐలయ్య ఉన్నారు.