ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ పరిధిలోని సంతపేటలో జరిగిన దొంగతనం కేసును టూ టౌన్ పోలీసులు చేదించారు. దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసి మీడియా ఎదుట వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్దనుండి సోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అనంతరం ఆ ముగ్గురిని విచారించగా రాష్ట్రవ్యాప్తంగా వారు పలుకేసులలో నిందితులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలియజేశారు. కేసులకు సంబంధించి 20 లక్షల విలువైన బంగారం మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు