కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సహకరించాలని ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి సూచించారు. బూత్ లెవెల్ అధికారులు డబుల్ ఎంట్రీ ఓటర్లు, మరణించిన వారి ఓట్లను జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకుంటారని వారికి, రాజకీయ పార్టీల నాయకులు సంపూర్ణమైన సహకారాన్ని అందించాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, వైసిపి, బిజెపి , ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.