లిక్కర్ కుంభకోణంలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు,దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమేయం,: సిట్ వెల్లడి
Ongole Urban, Prakasam | Sep 17, 2025
ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు,దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు తాజాగా వెలుగు చూసింది. మద్యం కుంభకోణం లో ముట్టిన ముడుపులను ఈ కేసులో ప్రధాన నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి అందజేయగా 2024 ఎన్నికల్లో ప్రకాశం, నెల్లూరు,తదితర జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు ఆయన ఆ నగదును పంపిణీ చేశారని పేర్కొంటూ సిట్ రెండో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. ఈ వార్త బుధవారం వ్యాపించింది జిల్లాలో దావాలనంలా వ్యాపించింది