చివ్వెంల: మోదీన్ పురం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న ఆరు మట్టి టిప్పర్ల పట్టివేత
అక్రమంగా మట్టి తరలిస్తున్న మట్టి తిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేశ్వర్ తెలిపారు. చివ్వేంల మండలంలో మోదీన్ పురం గ్రామ శివారులో తనిఖీలు చేపట్టగా గుట్టుచప్పుడు కాకుండా మట్టి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఆరు మట్టి టిప్పర్ లను అదుపులోకి తీసుకొని, ఆరుగురు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న మట్టి టిప్పర్లను స్టేషన్కు తరలించినట్లు తెలిపారు