నంద్యాల అర్బన్: ట్రంప్ ను కూడా వైసిపి నాయకులు గెలిపించారు అంటుంది రోజా : నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 12, 2026
మాజీ మంత్రి వైసిపి నాయకురాలు రోజాపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంగళవారం నంద్యాలలో ఆమె మీడియాతో మాట్లాడారు . ఇక్కడ జగన్ ను గెలిపించామని చెప్పలేరు కానీ ఎక్కడో తమిళనాడులో విజయ్ ని గెలిపించామని చెప్పడం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ఇంకేమీ లేదని అన్నారు. రోజాకు బుద్ధి ఉంటే ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసిపి నాయకులు వదిలేస్తే ట్రంపును కూడా మేమే గెలిపించామని వైసిపి నాయకులు అంటారని శబరి విమర్శించారు